పంటకాలువలో పల్టీకొట్టిన టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

పంటకాలువలో పల్టీకొట్టిన టిప్పర్‌

Sep 27 2026 4:04 AM | Updated on Sep 27 2026 4:04 AM

పంటకాలువలో పల్టీకొట్టిన టిప్పర్‌ మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు ఎన్జీరంగా యూనివర్సిటీకి స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు

ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి శాంతినగర్‌ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఓటిప్పర్‌ శనివారం అదుపుతప్పి పంట కాలువలో పల్టీ కొట్టింది. కొండపల్లి నుంచి కవులూరు వైపు ప్రయాణిస్తున్న టిప్పర్‌ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి కాలువ లోకి దూసుకెళ్లింది. రెండు రోజులగా కురిసిన వర్షాలతో రోడ్డు పక్కన మార్జిన్‌ చిత్తడిగా మారడంతో కాలువలోకి పల్టీకొ ట్టింది. ఈ ప్రమాదంలో ఇందిరమ్మ కాలనీ లోని ఓ ఇంటి గోడ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

మైలవరం: మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సుధాకర్‌ ఈ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మైలవరం మండలం పొందుగల తండాకు చెందిన బాణావతు హనుమంతు, వెల్వడం గ్రామానికి చెందిన వేముల మణికంఠ ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నారు. మైలవరం, మధిర టౌన్‌, ఎర్రుపాలెం, నూజి వీడు రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఐదు మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులను పోలీసులు ఛేదించి, వాహనాలు రికవరీ చేశారు. కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్‌ హరిబాబును అభినందించి, నగదు రివార్డు అందజేశారు.

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక స్కోచ్‌ గోల్డ్‌ అవార్డును కై వసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన స్కోచ్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో అవార్డును విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ పి.వి.సత్యనారాయణ, డీన్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు అందుకున్నారు. 2022లో స్కోచ్‌ గోల్డ్‌ అందుకున్న విశ్వవిద్యాలయం మరలా 2026లో సాధించడం విశ్వవిద్యాలయ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో విశ్వవిద్యాలయం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, వాటి ద్వారా రైతులకు అందు తున్న ప్రయోజనాలు, కార్యక్రమాల ప్రభావం సమాజంపై చూపుతున్న సానుకూల ఫలితాలను గుర్తిస్తూ ఈ జాతీయ స్థాయి పురస్కారం లభించింది. వీసీ మాట్లాడుతూ అవార్డును పొందటం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని అన్నారు. ఇది ఒక అవార్డు మాత్రమే కాదని, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు రైతులతో కలిసి చేపడుతున్న కార్యక్రమాలకు లభించిన జాతీయ స్థాయి గుర్తింపని చెప్పారు. డీన్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులు శాస్త్రవేత్తల సమష్టి కృషితో వ్యవసాయ విద్యను మరింత ఆధునికంగా, పరిశోధనలను మరింత ప్రయోజనకరంగా, వాటి ఫలితాలను రైతులకు మరింత వేగంగా చేరేలా చేపడుతున్న నిరంతర కృషికి గుర్తింపుగా అవార్డు లభించటం ఎంతో ఆనందదాయకమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement