కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
నిత్యాన్నదాన పథకానికి విరాళం
సమ్మోహనం.. కూచిపూడి నాట్యం
శుక్రవారం శ్రీ 30 శ్రీ జనవరి శ్రీ 2026
u8లో
● పామర్రుకు చెందిన వెంకటేష్ ఈఎస్‌ఐ చందాదారు. అతని భార్యకు ఆర్థ్రరైటిస్ కారణంగా మోకీళ్లు అరిగిపోవడంతో నడవలేని స్థితికి చేరుకుంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ గుణదలలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి రాగా, ఆమెను పరీక్షించి మందులు రాశారు. కీళ్ల మార్పిడి అవసరం అవుతుందని, కానీ చాలా వెయిటింగ్ లిస్టు ఉండటంతో కనీసం ఏడాది పడుతుందని చెప్పడంతో దిగాలుగా వెనుతిరిగారు.
ఇలా వీరిద్దరే కాదు ఉమ్మడి కృష్ణాలో పనిచేసే వయస్సులోనే పూర్తిగా కీళ్లు అరిగిపోయి, రీప్లేస్‌మెంట్ చేయించుకునే ఆర్థిక స్తోమత లేక మంచానికే పరిమితమైన వారు వందల సంఖ్యలో ఉన్నారు. వారి పట్ల ప్రభుత్వం దయచూపక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● విజయవాడ బ్రహ్మానందరెడ్డి నగర్‌కు చెందిన అన్నపూర్ణమ్మ (55) మోకీలు అరిగిపోవడంతో నడవలేని స్థితికి చేరుకుంది. పైగా కొండప్రాంతంలో ఉండటంతో మెట్లు ఎక్కిదిగలేని స్థితి ఈ దశలో కీళ్ల మార్పిడి అవసరమని వైద్యులు చెప్పడంతో ఆరోగ్యశ్రీలో పొందవచ్చని ఓ ఆస్పత్రికి వెళ్లగా.. అది వర్తించదని చెప్పారు. ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా కీళ్ల మార్పిడి అందుబాటులో లేదని చెప్పడంతో తీవ్రమైన నొప్పితో నడవలేక ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
7
మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదాన పథకానికి తిరువూరుకు చెందిన నల్ల వెంకట సత్యనారాయణ రావు, సీతా కుమారి దంపతులు రూ.1,00,116 అందజేశారు.
కూచిపూడిలో గురువారం శ్రీ సిద్ధేంద్ర యోగి జయంత్యుత్సవాన్ని పురస్కరించుకుని కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు సమ్మోహన పరిచాయి.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


