సచివాలయ ఉద్యోగుల కొవ్వొత్తుల ప్రదర్శన
జగ్గయ్యపేట: పట్టణ, మండలంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం రాత్రి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఎంప్లాయీస్ సమాక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణాచారి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి పనినీ సచివాలయ ఉద్యోగులకే అప్పజెబుతోందని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు దనికొండ ప్రసాద్, ప్రభాకరరావు, కుమారి, కృష్ణ, ఏపీ ఎన్‌జీవో నాయకులు రాచకొండ శ్రీనివాసరావు, కుమారి, బాబూరావు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.


