కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది.. | - | Sakshi
Sakshi News home page

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది..

Aug 9 2025 8:46 AM | Updated on Aug 9 2025 8:46 AM

కొత్త

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది..

పెనుగంచిప్రోలు: సంప్రదాయ పంటలతో నస్టాల సాగు చేసిన ఓ రైతు పండ్ల మొక్కలతో కొత్త సాగు చేసి విభిన్న పంటలతో ఆదాయాన్ని చూస్తున్నాడు. దాని గురి తెలుసుకోవాలంటే పెనుగంచిప్రోలు వెళదాం. గ్రామానికి చెందిన రైతు గింజుపల్లి శ్రీనివాసరావు. అతను సంప్రదాయ పంటలు పత్తి, మిర్చి ఏళ్లతరబడి సాగు చేసి తెగుళ్లతో, ధరలు లేక విసుగుచెందాడు. సాగులో కొత్తదనం కోసం ప్రయత్నించాడు. 18 నెలల క్రితం కడియం నుంచి పలు రకాల పండ్ల మొక్కలు తెచ్చి తనకున్న 2.44 ఎకరాల్లో నాటాడు. మొక్క కొనుగోలు, నాటడం, వ్యవసాయ ఖర్చులు, డ్రిప్‌ ఏర్పాటుకు సుమారుగా రూ.20 లక్షలు వెచ్చించాడు. పశువుల ఎరువు, ఇతర సేంద్రియ పద్ధతులతో సాగు చేశాడు

కొత్తగా అంజీర సాగు

శ్రీనివాసరావు ఈ ప్రాంతంలో ఎవరూ పండించని విధంగా తన పొలంలో అంజీర మొక్కలు నాటి ఫలసాయం కూడా పొందారు. అంజీర సాగు ఈప్రాంతంలో చేపట్టిన మొదటి వ్యక్తి. ఆ పండ్లను డ్రై చేసేందుకు సొంతగా యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంజీరతో పాటు డ్రాగన్‌, నిమ్మ, మామిడి, జామ, సపోట, సీతాఫలం, రామాఫలం, రేగు, ఉసిరి, పనస, తదితర పండ్లతో పాటు పొలం చుట్టూ శ్రీగంధం, మహాగని, కొబ్బరి మొక్కలు కూడా నాటాడు.

సొంతగా విక్రయం...

ప్రస్తుతం అంజీర, డ్రాగన్‌ పండ్లను అతనే సొంతంగా విక్రయిస్తున్నాడు. అంజీర కిలో రూ.100, డ్రాగన్‌ కిలో రూ.100 నుంచి రూ.150 చొప్పున విక్రయిస్తున్నాడు, రేగిపండ్లు కూడా 150 కిలోల వరకు విక్రయించినట్లు రైతు శ్రీనివాసరావు తెలిపారు. నిమ్మ, జామలు కూడా కాపునకు వచ్చాయని ఏదో ఒక పండ్లద్వారా 365 రోజులూ ఆదాయం పొందేలా సాగు చేస్తున్నానని తెలిపారు. పండ్ల మొక్కలు పెద్దవి కావటంతో మధ్యలో పసుపు, బంతి అంతర పంటల సాగు చేపట్టారు. మొత్తంగా పొలం మొత్తం ఏదో ఒక పంటల ద్వారా ఆదాయం పొందేలా రైతు చేస్తున్న సాగును చూసి పలువురు అభినందిస్తున్నారు.

365 రోజులూ ఆదాయం పొందేలా సాగు నష్టాలు రాకుండా విభిన్న పంటలు ఒకే చోట పలు రకాల పండ్లు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పెనుగంచిప్రోలు రైతు శ్రీనివాసరావు సొంతంగా విక్రయిస్తూ ఆదాయార్జన

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది.. 1
1/3

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది..

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది.. 2
2/3

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది..

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది.. 3
3/3

కొత్త సాగు.. ఆదాయం తెచ్చింది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement