
గుడ్లవల్లేరు: మండలంలోని అంగలూరులో క్రికెట్ ఆడుతున్న యువకుడిని గుండెపోటు బలి తీసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. అంగలూరులో బుధవారం తన తోటి స్నేహితులతో కొమ్మలపాటి సాయి(26) క్రికెట్ ఆడుతూ బౌలింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన గుడివాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అతను అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని గుడ్లవల్లేరు ఎస్‌ఐ ఎన్.వి.వి.సత్య నారాయణ తెలిపారు.