సమస్యలు పరిష్కరించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్‌ కార్యాలయం లోనికి మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, అధికారులు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న వేతనాలు అందించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు చెల్లించాలని పలుమార్లు వినతి పత్రాలు అందించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సంఘటన స్థలానికి కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దీన్‌, సీఐ ప్రేమ్‌ కుమార్‌లు చేరుకొని కార్మికులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గబోమని కార్మికులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement