కోసిని ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు వినతి | - | Sakshi
Sakshi News home page

కోసిని ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు వినతి

Oct 17 2026 6:36 AM | Updated on Oct 17 2026 6:36 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోకుండా కాపాడుకునేందుకు మండలంలోని కోసి ని ప్రాజెక్టు నుంచి నీటిని బామగండి చెరువు కు విడుదల చేయాలని తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్‌ ముంజం ఆనంద్‌ కుమార్‌ రైతులతో కలిసి శుక్రవారం కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికొచ్చే సమయంలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు వినోద్‌, మధు, శంకర్‌, శ్రీనివాస్‌, ఓమాజి, మధున య్య, రవి, సురేశ్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement