ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో వివిధ శాఖల ప రిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తి చే యాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మా ట్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్డీఏ దత్తారావ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ వీవో, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని, అంగన్వాడీ కేంద్రాల్లో మూత్రశాలలు లేని వాటిని గుర్తించి వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అటవీ భూములకు సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు కలగకుండా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని, అవసరమైన చోట గ్రామసభలు నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.


