కాగజ్‌నగర్‌టౌన్: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ – 2026లో భాగంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలంలోని వంజీరి రైతువేదికలో మంగళవారం బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత పేర్ల చేర్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు, సవరణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే నిర్వహించే సమయంలో పాటించాల్సిన నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మల్లెపూల మధుకర్, రామ్మోహన్, బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.


