యోగాతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

యోగాతో మానసిక ప్రశాంతత

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జనరల్‌ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ రవీందర్‌కుమార్‌ అన్నారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి యోగా రన్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలన్నారు. తద్వారా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధులను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక గొప్ప సాధనమన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నర్సింగ్‌ అధికారి విజయమ్మ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌, నాయకులు మారుతి, ఆయుష్‌ సిబ్బంది సుజాత, శిల్పా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement