మూత‘బడికి కొత్త కళ’ | - | Sakshi
Sakshi News home page

మూత‘బడికి కొత్త కళ’

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

ఆసిఫాబాద్‌ పట్టణ పరిధిలోని హీరాపూర్‌ మండల పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులు లేరని ఏడేళ్ల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి చిన్నారులు వాగు మార్గం గుండా మూడు కిలోమీటర్ల దూరంలోని బెస్తవాడ మండల పరిషత్‌ పాఠశాలకు వెళ్తున్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు వార్డు కౌన్సిలర్‌ సాలంబీన్‌ అహ్మద్‌ మూతపడిన పాఠశాలకు పెయిటింగ్‌ వేయించి డోర్లు, కిటికీలకు మరమ్మతులు చేయించారు. సోమవారం పాఠశాలను మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాశ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌తో కలిసి డీఈవో సచ్చిదానంద చారి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌, ఎంఈవో సుభాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement