ఆసిఫాబాద్: ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసి కుమురంభీం స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పో రాడాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. భీం పోరాట పటిమతోనే జిల్లా కేంద్రంలో తొలి పార్టీ కార్యాల యం ప్రారంభించామని తెలిపారు. కొత్త పార్టీ ఆవి ర్భావం తర్వాత తొలిసారి సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. పట్టణంలో పార్టీ జెండా ఆవిష్కరించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు మందు ఫారెస్ట్ చెక్‌పోస్టు నుంచి డప్పుచప్పుళ్లతో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్, కుమురంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా యాప్ తొలగించి, రైతులకు ఎకరాకు మూడు బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తరుగు పేరుతో రైతుల నుంచి రూ.1200 కోట్లు కొట్టేసిందని ఆరోపించా రు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ విత్తన వ్యా పారులపై పీడీ యాక్టు నమోదు చేయాలన్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో పోడు రైతుల వద్దకు పోలీసులు వస్తున్నారని, వారి పొట్ట కొట్టొద్దన్నారు. గిరిజన కార్పొరేషన్‌లో రిక్రూట్‌మెంట్ లేక నిర్వీర్యమవుతుందని, వెంటనే రిక్రూట్‌మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. 1/70 యాక్టు అమలు చేస్తూ 1970కి ముందు ఏజెన్సీలో వారసత్వంగా సంక్రమించిన భూమికి క్రయవిక్రయాలు జరుపుకొనేలా వెసులుబాటు కల్పించాలన్నారు. తెలంగాణపై ఆంధ్ర పాలకులు దాడి చేస్తే అడ్డుకునే ఏకై క పార్టీ తమ టీఆర్‌ఎస్ అని అన్నారు. పార్టీ కార్యాల యం ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు వినోద్, కాగజ్‌నగర్ ఇన్‌చార్జి సబిత, నాయకులు మహోర్క ర్ అశోక్, రాంప్రసాద్, రియాజ్ పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయంలో కవిత, టీఆర్‌ఎస్ నాయకులు


