రైతుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి

Jun 16 2026 12:28 AM | Updated on Jun 16 2026 12:28 AM

● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కాగజ్‌నగర్‌టౌన్‌: రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని వంజీరి రైతు వేదికలో సోమవారం రైతులకు జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. పంట మార్పిడి పాటించాలని సూచించారు. ఈ ఏడాది కౌటాల, కాగజ్‌నగర్‌ కొనుగోలు కేంద్రాల్లో లక్ష బస్తాల మక్కలు సేకరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ మనోహర్‌, ఏవో రామకృష్ణ, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పద్మాకర్‌, సర్పంచ్‌ లక్ష్మి, ఉప సర్పంచ్‌ భరత్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకో వాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం 239 మందికి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మధుకర్‌, కౌన్సిలర్లు, సర్పంచులు గజ్జి లింగయ్య, కుందారపు సుమన్‌, రాజేందర్‌, ప్రకాశ్‌, కోట వేణు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement