కాగజ్‌నగర్‌టౌన్: పోలీసులు అంకితభావంతో వి ధులు నిర్వహించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. లాకప్ రూమ్, రిసెప్షన్, బెల్ ఆఫ్ ఆరమ్స్ రూమ్, స్టోర్ రూమ్‌లను తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు, రిజిస్టర్ పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల నివారణపై దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. డీఎస్పీ వహీదుద్దీన్, ఎస్సై సందీప్, సిబ్బంది పాల్గొన్నారు.
చట్ట పరిధిలో ఫిర్యాదులు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: చట్ట పరిధిలో ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్నారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించారు. పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు.


