గ్యాస్‌ వాడకుండా వంటల పోటీలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ వాడకుండా వంటల పోటీలు

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని సర్‌సిల్క్‌ కాలనీలో బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో ఆదివారం గ్యాస్‌, వంటనూనె వినియోగంచకుండా వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హాజరై మాట్లాడారు. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయడానికి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గ్యాస్‌, వంట నూనెను ఉపయోగించకుండా వంటలు చేయడం సంతోషకరమన్నారు. నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. పీఎం జన్‌ధన్‌, స్వనిధి పథకాలతో మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వంటల పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా మోర్చ నాయకులు మంజుల, కౌన్సిలర్‌ గజ్జెల లావణ్య, స్రవంతి, సామాజిక సేవకులు స్వాతి, అన్నపూర్ణ, సరోజ, సత్తమ్మ మహిళలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement