కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు చేపట్టిన రిలే నిరహార దీక్ష 24వ రోజుకు చేరింది. శుక్రవారం వీరికి ప్రజాసంఘాల నాయకులు మద్దతు తె లిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మి ల్లు కార్మికులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్ర జాస్వామ్య హక్కు ఉందని తెలిపారు. ఎన్నికలు ని ర్వహించకపోవడమంటే కార్మికుల హక్కులను కా లరాయడమేనని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించి, గు ర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ప్రజాసంఘాల మద్దతు ఉంటుందని తెలిపా రు. సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజేందర్, ముంజం శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.


