రెబ్బెన: సింగరేణిలో గెలిచిన సంఘాల వైఫల్యంతోనే కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ హైమద్ విమర్శించారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో బుధవారం నిర్వహించిన హెచ్‌ఎంఎస్ గేట్ మీటింగ్‌కు హాజరై మాట్లాడారు. 14 నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కార్మి కుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతినెలా కనీ సం రెండుసార్లు సమావేశాలు నిర్వహించాలని డి మాండ్ చేశారు. రాజకీయ జోక్యం లేకుండా పాత విధానంలోనే నియామక పత్రాలు అందించాలన్నారు. ఏఐటీయూసీ నాయకత్వం యాజమాన్యానికి ఒంటరిగా సమ్మె నోటీసు ఇవ్వడం కార్మికులను మోసం చేయడమేనని స్పష్టం చేశారు. కార్మిక సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని సంఘాలను కలుపుకొని పోవాలని హితవు పలికారు. ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజాబాబు, బ్రాంచి కార్యదర్శి శివారెడ్డి, ఫిట్ కార్యదర్శి దుర్గం వెంకటేశ్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి కుమార్‌గౌడ్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్‌కే ఇనూస్ పాల్గొన్నారు.


