ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలి

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

● ఎస్పీ నితిక పంత్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో యువత అధికంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌, మద్యం తాగి, మొబైల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయొద్దని కోరారు. అనంతరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలకు స్క్రీన్‌పై ప్రదర్శించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీ అశోక్‌, ప్రిన్సిపాల్‌ ప్రియదర్శిని, సీఐలు బాలాజీ వరప్రసాద్‌, సతీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement