రెబ్బెన: మండలంలోని 24 పంచాయతీల ప్రజలు ఏదైనా అనారోగ్యానికి గురైతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిందే. ఎండాకాలం కావడంతో ఆస్పత్రిలో తాగేందుకు నీటిసౌకర్యం లేదు. రూ.లక్షలు ఖర్చు చేసి రోగులు, ప్రజ ల తాగునీటి సౌకర్యం కల్పించేందుకు గతంలో ఆర్వో ప్లాంటు ప్రారంభించారు. అది చెడిపోగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. చల్లని నీటిని ఏర్పాటు చేసేందుకు ఫ్రిజ్ అందుబాటులో ఉన్నా ప్రస్తుతం ఉపయోగంలో లేదు. వాటర్‌ప్లాంట్ల నుంచి క్యాన్లు కొని ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవి సరిపోక రోగులు దాహార్తితో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక వేసవి తీవ్రత దృష్టా ఆస్పత్రిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచారు. ఇద్దరు డాక్టర్లు ఉండగా మంగళవారం ‘సాక్షి’విజిట్ చేసిన సమయంలో ఒక్కరే అందుబాటులో ఉన్నారు.


