బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల దురహంకారానికి బలైన పసిపాప కుటుంబానికి న్యాయం చేయాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్ రమేశ్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గణపతి డిమాండ్ చేశారు. ర జక సంఘం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ప ట్టణంలో బుధవారం నిరసన తెలిపారు. వారు మా ట్లాడుతూ కుమ్మెరలో మల్లన్న జాతరలో రజక కు టుంబానికి చెందిన వారిని ఆలయంలోకి వెళ్లకుండా అగ్రకుల నాయకులు అడ్డుకోవడం దారుణమన్నారు. చిన్నారి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం ఆగదని హెచ్చరించారు. నాయకులు రాజమల్లు, కొండపర్తి రాజేశ్, పిప్పిరి సాయి, రామరాజు, రమేశ్, సత్తయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి


