పాఠాలు విని.. బాధ్యతలు తెలుసుకుని | - | Sakshi
Sakshi News home page

పాఠాలు విని.. బాధ్యతలు తెలుసుకుని

Feb 26 2026 8:33 AM | Updated on Feb 26 2026 8:33 AM

పాఠాలు విని.. బాధ్యతలు తెలుసుకుని

పాఠాలు విని.. బాధ్యతలు తెలుసుకుని

● నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ● 24 అంశాలపై అవగాహన

కాగజ్‌నగర్‌టౌన్‌: పంచాయతీ పాలనలో ప్రజాసేవలు, అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్‌ చట్టంపై సర్పంచులు, వార్డు సభ్యులకు జిల్లా అధికారులు శిక్షణ అందిస్తున్నారు. దాదాపు 24 అంశాలపై మాస్టర్‌ ట్రైనర్ల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. జనవరి 19 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు సర్పంచులకు విడతలవారీగా 50 నుంచి 100 మంది చొప్పున ప్రజాపాలనపై శిక్షణ అందించారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 31 వరకు ఆయా మండల కేంద్రాల్లో వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 335 పంచాయతీలు ఉండగా, 332 మంది సర్పంచులు ఉన్నారు. మరో మూడుచోట్ల ఎన్నికలు జరగకపోవడంతో ఉప సర్పంచులే పరిపాలన బాధ్యతలు చేపట్టారు.

అవగాహన కల్పిస్తున్న అంశాలివే..

గ్రామాలాభివృద్ధిలో పాలకవర్గాల పాత్ర అత్యంత కీలకం. మొదటిసారి ఎన్నికైన వారికి పాలనలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ తరగతులకు శ్రీ కారం చుట్టింది. పంచాయతీరాజ్‌చట్టం, గ్రామపాలన, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి పథకాల అ మలు, సభల నిర్వహణ, నిధుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, జనన, మరణాల నమోదు, ఈ– పంచాయతీ, ఈ– పాలన, వివాదాల పరిష్కారం, సామాజిక న్యాయం, సీ్త్రశిశు సంక్షేమం, ఆదాయ వనరులు, సిబ్బంది, సమావేశాల నిర్వహణ, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, పాలనలో పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, సామాజిక తనిఖీ, సీ్త్రల భాగస్వామ్యం అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీలో సభ్యుల విధులు, వాటి నిర్వహణ, ఆదాయ, వ్యయ నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలులో పాత్ర, ప్రజారోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement