శభాష్‌ కిష్టయ్య | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ కిష్టయ్య

Nov 5 2025 7:25 AM | Updated on Nov 5 2025 7:25 AM

శభాష్‌ కిష్టయ్య

శభాష్‌ కిష్టయ్య

● 85 ఏళ్ల వయస్సులోనూ సత్తా చాటుతున్న వెటరన్‌ క్రీడాకారుడు ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు ● 2019లో హెల్తీ సీనియర్‌ సిటిజన్స్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో 70 ఏళ్లకు పైబడిన విభాగంలో డిస్కస్‌త్రోలో తృతీయ బహుమతి, జావెలిన్‌త్రోలో ప్రథమ బహుమతి, షాట్‌పుట్‌లో తృతీయ బహుమతి సాధించాడు. ● 2020లో హర్యానాలో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో 75 ఏళ్లకు పైబడిన విభాగంలో షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, హ్యామర్‌త్రోలో ద్వితీయ బహుమతి సాధించాడు. ● 2022లో మహారాష్ట్రలోని నాసిక్‌లో నిర్వహించిన 2వ నేషనల్‌ వెటరన్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో 85 ఏళ్ల విభాగంలో షాట్‌పుట్‌లో ద్వితీయ బహుమతి, డిస్కస్‌త్రోలో ప్రథమ బహుమతి సాధించాడు. ● 2022లో సికింద్రాబాద్‌లో జరిగిన 3వ సీనియర్‌ సిటిజన్స్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో 80 ఏళ్లకు పైబడిన విభాగంలో డిస్క్‌త్రోలో ప్రథమ బహుమతి సాధించాడు. ● 2022లో హన్మకొండలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 80 ఏళ్లకు పైబడిన విభాగంలో డిస్కస్‌త్రోలో ఫస్ట్‌ప్లేస్‌, షాట్‌పుట్‌లో తృతీయ బహుమతి సాధించాడు. ● 2022లో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి వెటరన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో 80 ఏళ్ల విభాగంలో షాట్‌పుట్‌లో తృతీయ బహుమతి సాధించాడు. ● 2023లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్‌ మీట్‌లో 80 ఏళ్ల విభాగంలో షాట్‌పుట్‌లో తృతీయ, డిస్కస్‌త్రోలో ద్వితీయ, జావెలిన్‌త్రోలో తృతీయ బహుమతి సాధించాడు. ● 2024లో హైదరాబాద్‌లో నిర్వహించిన 5వ నేషనల్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో 85 ఏళ్లకు పైబడిన విభాగంలో జావెలిన్‌త్రోలో తృతీయ బహుమతి ఽసాధించాడు. ● 2025 అక్టోబర్‌లో గుజరాత్‌లోని సూరత్‌ యూనివర్సిటీలో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో 85 ఏళ్లకు పైబడిన విభాగంలో డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో ద్వితీయ బహుమతి సాధించాడు. ● ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 7వ మాస్టర్‌ గేమ్స్‌ తెలంగాణ రాష్ట్ర చాంపియన్‌షిప్‌ పోటీల్లో హ్యామర్‌త్రో, డిస్కస్‌త్రోలో ప్రథమ, షాట్‌పుట్‌లో ద్వితీయ బహుమతి సాధించాడు.

రామకృష్ణాపూర్‌: ఎనిమిది పదుల వయస్సు దాటినా వెటరన్‌ పోటీల్లో అమీతుమీకి సిద్ధం అంటున్నాడు రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు శఠగోపం కిష్టయ్య. షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రో, జావెలిన్‌ త్రో, హ్యామర్‌త్రో...తదితర అంశాల్లో ప్రావీణ్యం ఉన్న కిష్టయ్య 85 ఏళ్ల వయస్సులోనూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన కిష్టయ్య మందమర్రి ఏరియాలోని ఎంకే4 గనిలో హెడ్‌ ఓవర్‌మెన్‌గా విధులు నిర్వర్తించేవాడు. 2005లో మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆయ్యాడు. సింగరేణిలో పనిచేసిన సమయంలోనూ ఏరియా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించాడు.

సాధించిన బహుమతులు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement