ఆసిఫాబాద్‌రూరల్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్నేళ్లుగా డిగ్రీ, పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. నిర్వహణ భారంగా మారడంతో రెండు రోజుల నుంచి ప్రైవేట్ కాలేజీలను మూసివేశారని పేర్కొన్నారు. విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని నిధులు విడుదల చేయాలని కోరారు. కళాశాలల నిరవధిక బంద్‌కు పీడీఎస్‌యూ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సహయ కార్యదర్శి నితిన్, నాయకులు వంశీ, షేక్ సమీర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


