నాణ్యత పాటించకుంటే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలి టీ పరిధిలోని హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల యజమానులు నాణ్య త పాటించకుంటే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గజానంద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయా దుకాణాల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, సురక్షితమైన నీటిని అందుబా టులో ఉంచాలన్నారు. పట్టణంలోని వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామయ్య, టీపీబీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


