‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు రూ.50వేల రుణం | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు రూ.50వేల రుణం

Nov 5 2025 8:09 AM | Updated on Nov 5 2025 8:09 AM

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు రూ.50వేల రుణం

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు రూ.50వేల రుణం

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

ఆసిఫాబాద్‌: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు, ఆర్థికంగా వెనుకబడిన సభ్యులకు మండల సమాఖ్య నుంచి రూ.50వేల వరకు రుణం అందించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం సెర్ప్‌ పీఎం సుధాకర్‌, డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి సెర్ప్‌ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు, యూడీఈడీ పెన్షన్‌, నూతన గ్రూపుల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వందశాతం బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి చేయాలని, సీ్త్రనిధి లక్ష్యాన్ని సాధించాలన్నారు. రుణాల రికవరీ లక్ష్యాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిర మహిళా శక్తి పథకం కింద కోళ్ల పెంపకం, డెయిరీ ఫాం ఏర్పాటు, చేపల పెంపకం, సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌, క్యాంటీన్ల నిర్వహణతో వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. నూతన సంఘాలు ఏర్పాటు చేసే వారికి రుణ సహాయాన్ని కల్పించాలన్నారు. సమావేశంలో ప్రాజెక్టు మేనేజర్లు, సహాయ ప్రాజెక్టు మేనేజర్లు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

వాంకిడి(ఆసిఫాబాద్‌): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. మండలంలోని జైత్‌పూర్‌లో ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మోడల్‌ గ్రామంగా ఎంపికై న జైత్‌పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారులు ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు తరచూ పనులను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement