కాలం చెల్లిన మందులు అమ్మొద్దు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులకు కాలం చెల్లిన మందులు అమ్మొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటి అన్నారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పురుగుల మందులు, ఎరువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంత రం గిన్నెధరి రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయిల్‌పాం సాగు ద్వారా రైతులు అధిక లాభాలు సాధించవచ్చన్నారు. ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని తెలిపారు. అంతకు ముందు రైతులకు భూసార పరీక్షల కు సంబంధించిన కార్డులను అందించారు. కార్యక్రమంలో ఏవో వినయ్‌రెడ్డి, ఏఈవోలు శ్రవణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


