కార్తికం.. మహిమాన్వితం!
కార్తిక పౌర్ణమికి సర్వం సిద్ధం ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగ మహిళల ప్రత్యేక పూజలు ప్రమిదలను నీటిలో విడవనున్న భక్తులు
కెరమెరి: భారతీయ సంప్రదాయంలో కార్తిక మా సం పరమ పవిత్రమైనది. ఈ నెలరోజులు నిత్యం పూజలు, దానధర్మాలు, దీపారాధనలు, పురాణ శ్ర వణం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ మాసానికి అనుబంధంగా వచ్చే పండుగ కార్తిక పౌర్ణమి. దీనిని కై శిక పౌర్ణమి, వైకుంఠ పౌర్ణమి, జిడికంట పున్నమి అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతీరోజు మహిళలు తులసీ దళానికి పూజలు, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి తరిస్తారు. నేడు కార్తికపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
పురాణ కథలు
తమిళనాడులో తిరువణ్నామళైగా ప్రసిద్ధి చెందిన అరుణాచలంలో కొండమీద ఉన్న దీపస్తంభంలో ఈ రోజు వెలిగించే జ్యోతిని దర్శించడానికి అధికసంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడ ఈ రోజు వెలిగించే దీపం ఎన్నో రోజుల వరకు వెలుగుతూనే ఉంటుందని ప్రతీతి. అలాగే ఇంటి ఎదుట వందలాది ప్రమిదల్లో నూనెపోసి దీపాలు వెలిగిస్తారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటారు.
గొప్ప వ్రతాల్లో ఒకటి..
వ్రతాల్లో కార్తికపౌర్ణమికి ప్రత్యేకత ఉంది. తెలుగు ప్రజలు ఈ రోజు చలిమిడి చేస్తారు. వేపుడు బియ్యం లేదా అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. బలిచక్రవర్తికి ఒకసారి శరీరమంతా మంటలు వ్యాపించాయి. ఆ రోజు ఆయన సంస్థాన వైద్యులు, ప్రత్యేక పురోహితుల సలహా మేరకు కార్తికపౌర్ణమి రోజున శివున్ని పూజించమని చెప్తారు. అలా చేయడంతో బలి చక్రవర్తి శరీరంలో మంటలు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పటి నుంచి కార్తికపౌర్ణమి వ్రతం ఆచరణలో ఉందని పూర్వీకులు చెబుతారు.
తులసీ కల్యాణం
కార్తిక పౌర్ణమి సందర్భంగా తులసీ కల్యాణం చేయడం శుభప్రదమని చెబుతారు. తులసి మొక్క వల్ల వాతావరణం పవిత్రంగా ఉంటుంది. పాపపు ఆలోచనలను తొలగిస్తుంది. ప్రతీ ఇంట్లో తులసి మొక్క పాపపుణ్యాల స్థానం కలిగి ఉంటుంది. తులసి నారాయణునికి అత్యంత ప్రియమైనది. తులసి చెట్టుకు కల్యాణం జరిపిస్తే ఇంటిల్లిపాది సుఖసంతోశాలతో వర్ధిల్లుతారు. తులసి మొక్కకు ఉసిరి చెట్టుతో వివాహం జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. తులసీ మాత మండపం చెరుకు ఆకులతో తయారు చేస్తారు. ఇలా చేస్తే చెరుకులోని తీయదనం మన జీవితంలో కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తికం.. మహిమాన్వితం!


