
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో గల శ్రీనివాస ఫ ల్టిలైజర్ షాపును మంగళవారం ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, ఈ పాస్ యంత్రం, ధరల పట్టిక, స్టాక్ వివరాలు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడు తూ రైతులు వ్యవసాయ అధికారుల సూచనల ప్ర కారం యూరియా, ఇతర మందులు వినియోగించాలని సూచించారు. ఎరువులు, మందులు అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత షాపుల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ మిలింద్‌కుమార్ పాల్గొన్నారు.
అర్హులైన గిరిజనులకు సంక్షేమ పథకాలు అందాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్పక్ష అభియాన్, ఆది ఖర్మ యోగి అభియాన్ అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడతూ ఆది కర్మ యోగి కార్యక్రమాల ద్వారా 12 మండలాల్లోని 102 గ్రామాల్లో ఉన్న గిరిజనులకు సంక్షేమ పథకాలు చేరేలా బ్లాక్ స్థాయి(మండల) మాస్టర్ ట్రైనర్లు గ్రామస్థాయి శిక్షకులకు శిక్షణ ఇవ్వాలన్నారు. వివిధ శాఖల నుంచి పంచాయతీ స్థాయి సిబ్బందిని ఎంపిక చేయాలని సూచించారు. శిక్షణ పూర్తయిన తర్వాత 102 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, డీఆర్‌డీవో దత్తారావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, డీఎంహెచ్‌వో సీతారాం, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, పర్యాటకశాఖ అధికారి అశోక్ పాల్గొన్నారు.