పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Jun 22 2025 3:50 AM | Updated on Jun 22 2025 3:50 AM

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

లింగాపూర్‌: వార్షిక తనిఖీల్లో భాగంగా మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆసిఫాబా ద్‌ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ చిత్తరంజన్‌ దాస్‌ శని వారం తనిఖీ చేశారు. రికార్డులు, రిసెప్షన్‌, పోలీస్‌స్టేషన్‌ ఆవరణ, పరిసరాలు పరిశీలించారు. ఎస్సై గంగన్నతోపాటు సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. సమస్యలు తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మండల వ్యాప్తంగా సీసీ కెమెరాలు అ మర్చుకునేలా ప్రజలను చైతన్యప ర్చాలని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆయన వెంట జైనూర్‌ సీఐ రమేశ్‌, పోలీస్‌ ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement