గ్రానైట్‌ పరిశ్రమకు అండగా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ పరిశ్రమకు అండగా ప్రభుత్వం

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

గ్రానైట్‌ పరిశ్రమకు అండగా ప్రభుత్వం

ఖమ్మంఅర్బన్‌: జిల్లాలో గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం గ్రానైట్‌ స్లాబ్‌ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయగా మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడారు. గ్రానైట్‌ పరిశ్రమలకు సంబంధించి సమస్యలు తన దృష్టికి రాగానే అండగా నిలుస్తున్నానని తెలిపారు. తెలంగాణలో మరెక్కడా లేని విధంగా జిల్లాలోని గ్రానైట్‌ స్లాబ్‌ ఫ్యాక్టరీల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, గ్రానైట్‌ అసోసియేషన్‌ నాయకులు రాయల నాగేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, మార్కెట్‌ చైర్మన్‌ యరగర్ల హనుమంతరావు తదితరులు మాట్లాడారు. అనంతరం అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా కమర్తపు గోపాల్‌రావు, ప్రధాన కార్యదర్శిగా పుచ్చకాయల మాధవరావు, కోశాధికారిగా షేక్‌ రియాజ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పాలకవర్గ బాధ్యులు దొడ్డ రాకేష్‌, ఆవుల వెంకటరెడ్డి, దొండేటి స్వేదన్‌, ధనాల వెంకటకృష్ణ, పెరుమాళ్లపల్లి రవికుమార్‌, వేముల నవీన్‌, చరణ్‌, ప్రవీణ్‌, పాటిబండ్ల అనుదీప్‌, బోయిడి వెంకట రంగారావు, గుండా పుల్లారావు తదితరులు బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement