సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

ఖమ్మం వైరారోడ్‌: జిల్లాలోని పలు ప్రాంతాల వారి చికిత్సకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అందజేశారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ శుక్రవారం వారు లబ్ధిదారులకు చెక్కులు అందజేశాక మాట్లాడారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదప్రజల ఆరోగ్య అవసరా లను గుర్తించి రాజకీయ వివక్ష లేకుండా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను అందజేశారని తెలిపారు. ప్రస్తు త ప్రభుత్వం మాత్రం రూ.60వేలకు మించి ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లం వేణు గోపాల్‌, పగడాల నాగరాజు, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, ముత్యాల వెంకట ప్పారావు, దిరిశాల దాసురా వు, కోటిరెడ్డి, మంకెన రమేష్‌, లింగనబోయిన సతీష్‌ పాల్గొన్నారు.

రేపు జిల్లా స్థాయి క్రాస్‌

కంట్రీ ఎంపిక పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: అండర్‌ – 16, 18, 20తో పాటు సీనియర్‌ మహిళలు, పురుషుల విభా గాల్లో జిల్లాస్థాయి క్రాస్‌ కంట్రీ జట్ల ఎంపికకు ఈనెల 29న పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం. డీ.షఫీక్‌ అహ్మద్‌ తెలి పారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈపోటీలు జరగనుండగా, అండర్‌–16 బాల బాలికలకు 2 కిలో మీటర్లు, అండర్‌–18 విభాగం బాలురకు 6 కి.మీ., బాలికలకు 4 కి.మీ., అండర్‌–20 బాలురకు 8కి.మీ., బాలికలకు 6కి.మీ., సీనియర్‌ పురుషులు, మహిళలకు 10కి.మీ. పరు గు ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు డిసెంబర్‌ 6న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.

స్కేటింగ్‌ క్రీడాకారులు...

జిల్లాస్థాయి అండర్‌–14, 17 బాలబాలికల విభాగాల్లో రోలర్‌ స్కేటింగ్‌ క్రీడాకారుల ఎంపికకు ఈనెల 29వ తేదీన పొటీలు నిర్వహిస్తున్న ట్లు జిల్లా పాఠశాలల క్రీడాసంఘం కార్యదర్శి వై. చిన్ని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయ సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, వివరాల కోసం కోచ్‌ కె.సురేష్‌(సెల్‌ 99123 99211)లో సంప్రదించాలని సూచించారు.

ఐక్య ఉద్యమాలతోనే

సమస్యల పరిష్కారం

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రంజాన్‌

కల్లూరురూరల్‌: విద్యారంగం, ఉపాధ్యాయుల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలే మార్గమని టీఎస్‌యూ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.కే.రంజాన్‌ స్పష్టం చేశారు. కల్లూరులో శుక్రవారం యూనియన్‌ నాయకులు, ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ పీఆర్‌సీ సాధన, పెండింగ్‌ డీఏల విడుదలతో పాటు ఉపాధ్యాయుల ఇతర సమస్యలపై పోరాడాల్సి న అవసరముందని తెలిపారు. విదేశాలకు వెళ్లి వచ్చిన బృందాలు అక్కడ ఏం పరిశీలించాయి, విద్యారంగానికి ఉపయోగపడేలా ఎలాంటి నివేదికలు రూపొందించారనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి సత్యనారాయణకు యూటీఎఫ్‌ మద్దతు ఇస్తోందని రంజాన్‌ తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఎం.అమర్నాథ్‌, రాంబాబు, వసంత, అలెగ్జాండర్‌, పరమేశ్వరరావు, జనులగడ్డ నాగలక్ష్మి, రాజేష్‌, సుధీర్‌ పాల్గొన్నారు.

తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలో కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే అదనుగా దళారులు, వ్యా పారులు ధరలను తగ్గిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement