కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో శనివారం 24వ స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకోసం ఆడిటోరియంలో ప్రత్యేక వేదిక ముస్తాబైంది. విశ్వవిద్యాలయం చాన్సలర్, గవర్నర్ శివప్రతాప్‌శుక్లా, ముఖ్యఅతిథిగా సైయంట్ సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇందులో 290 మంది అభ్యర్థులకు 408 బంగారు పతకాలు, 88 మందికి పీహెచ్‌డీ పట్టాలు పంపిణీ చేస్తారు. కాగా, స్నాతకోత్సవ ఏర్పాట్లను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజి స్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం పర్యవేక్షించారు. స్నాతకోత్సవం నిర్వహణకు టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందితో 12 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. అంతేకాక 250మంది పోలీసులతో బందోబస్తు ఉంటుందని, పాస్‌లు ఉన్నవారికే ఆడిటోరియంలోకి అనుమతిస్తారని వెల్లడించారు.
అభ్యర్థులకు సూచనలు..
బంగారు పతకాలు అందుకోనున్న అభ్యర్థులు ఉద యం 7నుంచి 9 గంటల వరకు కేయూలోని దూరవిద్య కేంద్రం ద్వారా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నందున 14 బ్యాచ్‌లుగా చేశారు. ముందుగానే బంగారు పతకాలు స్వీకరించి, ఉదయం 9–20 గంటల్లోపు ఆడిటోరియంలోకి ప్రవేశించి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. బంగారు పతకాలతోనే బ్యాచ్‌ల వారీగా గవర్నర్‌తో ఫొటో సెషన్ ఉంటుంది. పీహెచ్‌డీ పట్టాలు అందుకునే అభ్యర్థులు కూడా దూరవిద్య కేంద్రం ద్వారానే ఆడిటోరి యంలోకి ప్రవేశించి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. వీరికి మాత్రం గవర్నర్ చేతులమీదుగా పీహెచ్‌డీ పట్టాల ప్రదానం ఉంటుంది. అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది కూడా వైట్ డ్రెస్ ధరించి రావాల్సి ఉంటుంది.
నేడు కేయూ 24వ స్నాతకోత్సవం


