1000 ఎం.ఎం. పైప్‌లైన్‌ మరమ్మతు పూర్తి | - | Sakshi
Sakshi News home page

1000 ఎం.ఎం. పైప్‌లైన్‌ మరమ్మతు పూర్తి

Nov 28 2026 12:38 AM | Updated on Nov 28 2026 12:38 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్‌డబ్ల్యూఎస్‌ గ్రిడ్‌కు చెందిన మిషన్‌ భగీరథ 1000 ఎం.ఎం. డీఐ పైప్‌లైన్‌కు ఏర్పడిన భారీ లీకేజీ మరమ్మతు పనులను సంబంధిత శాఖ ఉద్యోగులు పూర్తి చేశారు. ఖమ్మంలోని దానవాయిగూడెం వద్ద పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈనెల 25, 26వ తేదీల్లో నీటి సరఫరా నిలిపివేశారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ క్రమాన సుమారు 8 మెట్రిక్‌ టన్నుల బరువైన సామగ్రి పైప్‌లైన్‌పై పడడంతో ఒత్తిడి తట్టుకోలేక రెండు పైపులు పగిలి లీకేజీ ఏర్పడిందని గుర్తించారు. ఈమేరకు కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది మూడు రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించి మరమ్మతు పనులను శుక్రవారం రాత్రికి పూర్తి చేశారు. దీంతో శనివారం ఉదయం నుంచి నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రోటరీనగర్‌ పరిసర ప్రాంతాలతో పాటు ఖానాపురం, బల్లేపల్లి, టేకులపల్లి ప్రాంతాలతో పాటు గతంలో నీటి సరఫరా నిలిచిపోయిన అన్ని ప్రాంతాలకు సైతం నీటి సరఫరా జరగనుంది. కాగా, పైప్‌లైన్‌ మరమ్మతులతో నీటి సరఫరా నిలిచిపోయిన రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశామని అధికారులు వెల్లడించారు.

నేటి నుంచి నగరంలో నీటి సరఫరా పునరుద్ధరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement