సెలవుల్లో ఆధార్‌ సేవలు ! | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ఆధార్‌ సేవలు !

Oct 19 2026 12:49 AM | Updated on Oct 19 2026 12:49 AM

● 22వ తేదీ వరకు అందుబాటులో కేంద్రాలు ● అప్‌డేట్‌, సవరణలకు అవకాశం

● 22వ తేదీ వరకు అందుబాటులో కేంద్రాలు ● అప్‌డేట్‌, సవరణలకు అవకాశం

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆధార్‌ కార్డులు ఉన్నా.. అవి తీసుకుని ఏళ్లు దాటడంతో ఫొటో, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ అనివార్యమైంది. ఇందుకోసం కేంద్రాలకు వెళ్లాలంటే పాఠశాలకు గైర్హాజరు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యాన విద్యార్థులకు ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దసరా సెలవుల సందర్భంగా జిల్లాలోని 21మండలాల్లో ఎంఈఓ కార్యాలయా(ఎమ్మార్సీ)లు లేదా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యేకకేంద్రాలు ఏర్పాటుచేయించారు.

బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

విద్యార్థుల ఆధార్‌ కార్డుల్లో సవరణలు, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు ఈ కేంద్రాల్లో అవకాశం కల్పించారు. యూఐడీఏఐ ఆదేశాల మేరకు 7 – 15 ఏళ్ల వయస్సు పిల్లల బయోమెట్రిక్‌ అప్‌డేట్‌(ఎంబీయూ) తప్పనిసరి చేయించాల్సి ఉంది. ఇప్పటివరకు అప్‌డేట్‌ చేసుకోని వారు, ఏమైనా మార్పులు, చేర్పులు ఉన్న వారు సంబంధిత ధ్రువపత్రాలతో కేంద్రాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. ఈ విషయమై పాఠశాలల హెచ్‌ఎంలు అప్‌డేట్‌ పెండింగ్‌ ఉన్న విద్యార్థులను గుర్తించి కేంద్రాలకు వెళ్లేలా అవగాహన కల్పించాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. అంతేకాక ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచిస్తున్నారు.

రుసుములు ఇలా...

ఆధార్‌ కేంద్రాల్లో ఇష్టారీతిన నగదు తీసుకోకుండా అధికారులే రుసుములు ఖరారు చేశారు. ఈమేరకు 5–7 ఏళ్లు, 15–17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ ఉచితంగా చేస్తారు. అయితే, 7–15 ఏళ్ల పిల్లలకు మొదటిసారి అప్‌డేట్‌ ఉచితంగా చేయనుండగా.. రెండోసారైతే రూ.125 రుసుము తీసుకుంటారు. ఇక ఈ వయస్సు కేటగిరీలో ఎంబీయూ–1 పెండింగ్‌ తగ్గించేందుకు ఏడాది పాటు రుసుము మినహాయింపు ఇచ్చారు. ఇతర బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.125, ఆధార్‌ వివరాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సవరణలకు రూ.75, గుర్తింపు, చిరునామా పత్రాల అప్‌డేట్‌కు రూ.75 చొప్పున రుసుము నిర్ణయించారు. ఈనెల 22వ తేదీ వరకు ప్రత్యేక కేంద్రాలు కొనసాగనుండగా, ప్రస్తుత దసరా సెలవుల్లో ప్రక్రియ పూర్తిచేయించాలని డీఈఓ వాసంతి ఓ ప్రకటనలో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement