ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందేలా అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి తెలిపారు. వీవీసీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఆటోమోటివ్ సర్వీస్ అడ్వైజర్లుగా 30మందికి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. 19–28ఏళ్ల వయస్సు కలిగి, డిగ్రీ, బీటెక్, బీఈ డిప్లొమా, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు. అలాగే, ఆటోమోటివ్ స్పేర్స్ పిక్కర్, టెలీకాలర్ ఎగ్జిక్యూటివ్లుగా 15 మంది చొప్పున, యాక్సెసరీస్ ఎగ్జిక్యూటివ్లుగా పది మందికి శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 17న శనివారం ఖమ్మం ముస్తఫానగర్లోని వీవీసీ స్కిల్ డెవలప్మెంట్కు హాజరుకావాలని, వివరాలకు 77299 92061 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
వేగంగా పట్టభద్రుల ఓటరు నమోదు
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ
●ఖమ్మం మామిళ్లగూడెం: ప్రజల సమస్యలను మంత్రులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించి మాట్లాడారు. నాయకుల ఉతూములూరి లక్ష్మీనర్సింహారావు, కిలారు అనిల్ కుమార్, పాటి నర్సయ్య, కొట్టె రాజశేఖర్, దామా స్వరూప పాల్గొన్నారు.
బార్ కేటాయింపునకు నేడు డ్రా
ఖమ్మంక్రైం: కల్లూరులో బార్ ఏర్పాటుకు అందిన దరఖాస్తుల నుంచి శుక్రవారం డ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్, ప్రొహిబిషన్ అధికారి డి.జానయ్య తెలిపారు. కలెక్టరేట్లో ఉదయం 11గంటలకు డ్రా జరగనుండగా, ఉదయం 9–30గంటలకల్లా 325 మంది దరఖాస్తుదారులు సంబంధిత పత్రంతో హాజరుకావాలని, అధీకృత ప్రతినిధి హాజరైతే సదరు పత్రం సమర్పించాలని సూచించారు. దరఖాస్తుదారులు నిర్ణీత సమయానికి అవసరమైన పత్రాలతో హాజరై సహకరించాలని సూచించారు.


