కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక విధానాలు అవలంబిస్తూ మత్స్య రంగాన్ని అభివద్ధి పథంలో నడిపించాలని సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి సూచించారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో మూడు రోజులుగా ఇస్తున్న శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశాక ఆంజనేయస్వామి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. చేపలకు డిమాండ్ పెరగుతున్నందున మేలు జాతి చేపల పెంపకంపై దృష్టి సారించాలని తెలిపారు. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జి.విద్యాసాగర్రెడ్డి మాట్లాడగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు బి.రవీందర్, దివ్య పాల్గొన్నారు.


