ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలు లేకుండా నేరుగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, అథ్లెటిక్స్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆయన మాట్లాడుతూ అండర్–14, 16 విభాగాల్లో క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేరుగా జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపిక చేస్తోందని తెలిపారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా జాతీయ స్థాయికి ఎంపికవుతున్న జిల్లా క్రీడాకారులు ఈసారి కూడా సత్తా చాటాలని సూచించారు. అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎం.డీ.గౌస్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.వెంకన్న, టోర్నీ పరిశీలకులు కె.మహిధర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్బాబుతో పాటు డాక్టర్ నిశాంత్, ఎన్.ఉప్పల్‌రెడ్డి, ఎస్.కే.రంజాన్, వీవీఎస్.మూర్తి, ఎం.సుధాకర్, నక్క వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, రవికమార్, తిరుపతి, మైథిలి, వైశాలి, గౌతమ్, వివేక్‌చంద్ర పాల్గొన్నారు.
విజేతలు వీరే...
ఒక రోజుకు పరిమితంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్–16 బాలుర షాట్‌ఫుట్‌లో ఎన్.ఫ్రాంక్లిన్, ఎన్.శరణ్‌సాయి. ఎన్.వివేక్‌చంద్ర, 60 మీటర్ల పరుగులో కె.పార్థు, డి.అనిల్‌కుమార్, ఎస్.విఘ్నేష్, లాంగ్ంజంప్లో చరణ్, జి.స్వామి, ఎస్.జైన్పాషా, 80 మీటర్లలో వి.చరణ్‌గౌడ్, ఎన్.పాల్, ఎస్.అశ్వంత్, బాలికల 60 మీటర్ల పరుగులో టి.రేష్మా, ఎస్.కే.సాల్మమేహతాబ్, బి.మైథిలి, షాట్‌ఫుట్‌లో ఎం.వీనిక, కె.ఉమామహేశ్వరి, పి.భవ్యశ్రీ, 80 మీటర్లలో జె.రిషికా, బి.కావేరి, హెచ్.కౌముది, లాంగ్‌జంప్‌లో బి.మైథిలి, ఎస్.సాల్మమేహతాబ్, జి.కావ్య మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక అండర్–14 బాలుర ట్రయాథ్రన్ ‘బీ’లో వై.మనోహర్, ఎం.గౌతమ్, ఎన్.అక్షయ్తరుణ్, ట్రయాథ్లన్ ‘సీ’లో ఈ.వరుణ్, ఎస్.కే.యూనస్, ఎం.అభినయ్, బాలికల ట్రయాథ్లన్ ‘ఏ’లో పి.సనాఖాన్, ఎం.ప్రవళిక, కె.అనూష, ‘బీ’లో బి.రుత్వి, ఎస్.భార్గవి, బి.స్రవంతి వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు.


