సీఈసీ తొలగింపు డిమాండ్‌తో నేటి నుంచి నిరసనలు | - | Sakshi
Sakshi News home page

సీఈసీ తొలగింపు డిమాండ్‌తో నేటి నుంచి నిరసనలు

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో శుక్రవారం నుంచి ఈనెల 6 వరకు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్లు సీసీఏ, అఖిల పక్ష పార్టీల నాయకులు వెల్లడించారు. ఖమ్మంలోని మంచికంటి హాల్‌లో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 13 కోట్ల మంది ఓటర్లను తొలగించే ప్రయత్నం చేయడంతో పాటు యువ ఓటర్ల నమోదును అడ్డుకునే యత్నం చేసిన జ్ఞానేష్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ మేరకు 2న సంతకాలు సేకరించనుండగా, 3, 4, 5వ తేదీల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం, 6న నగరంలోని పెవిలియన్‌ మైదానం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీసీఏ ప్రతినిధులు ఐ.వీ.రమణారావు, డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్‌, రవిమారుత్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, సీపీఎం, మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, సీ.వై.పుల్లయ్య, నాయకులు సింగు నర్సింహరావు, ఆవునూరి మధు, కాకి భాస్కర్‌, మనోహర్‌రాజు, దేవిరెడ్డి విజయ్‌, చిర్రా రవి, కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement