ఐలమ్మ పోరాట పటిమ చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

ఐలమ్మ పోరాట పటిమ చిరస్మరణీయం

Sep 27 2026 12:34 AM | Updated on Sep 27 2026 12:34 AM

ఖమ్మం మయూరిసెంటర్‌: సమాజంలోని అసమానతలకు ఎదురొడ్డి, వెట్టిచాకిరి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శనివారం ఖమ్మంలోని జనరల్‌ ఆస్పత్రి వద్ద ఆమె విగ్రహానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ ధైర్యంగా పోరాడారని తెలిపారు. ఆమె పోరాట పటిమ, ధైర్యసాహసాలు మహిళా శక్తికి ప్రతీకగా నిలిచాయని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మహ్మద్‌ ఖాదర్‌ బాబా, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జి.జ్యోతి, వివిధ సంఘాల నాయకులు తుపాకుల ఎలగొండ స్వామి, జక్కుల వెంకటరమణ, కొత్తకొండ శ్రీలక్ష్మి, డాక్టర్‌ కే.వీ.కృష్ణారావు, తమ్మారపు బ్రహ్మయ్య, సట్టు వెంకటేశ్వర్లు, తెనాలి వీరబాబు, మాచర్ల వేలాద్రి, పగిడల కృష్ణవేణి, కణతాల నరసింహారావు, హరిప్రసాద్‌, వట్టికోట అప్పారావు, వల్లపు సోమరాజు, వెంకటేశ్వర్లు, లింగబోయిన పుల్లారావు, దుంపటి నగేష్‌, ఎడపల్లి భాస్కర్‌, పడిగెల కృష్ణవేణి, కనతాల వెంకన్న, వల్లంకొండ కొండలు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement