అర్హులందరికీ పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ పింఛన్లు

Sep 27 2026 12:34 AM | Updated on Sep 27 2026 12:34 AM

తల్లాడ: చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు నష్టం జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. తల్లాడ మండలం అన్నారుగూడెంలో చేయూత దరఖాస్తుల పరిశీలనను ఆమె శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఇంటికి వెళ్లి దరఖాస్తులోని వివరాలు, ధ్రువపత్రాలను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీడీఓ శ్రీధర్‌రాజు, వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ ఎండీ.తాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement