గడువులోగా దరఖాస్తుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గడువులోగా దరఖాస్తుల పరిష్కారం

Sep 27 2026 12:34 AM | Updated on Sep 27 2026 12:34 AM

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ● రీసర్వే డేటా ఎంట్రీ వివరాల పరిశీలన

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ● రీసర్వే డేటా ఎంట్రీ వివరాల పరిశీలన

ఎర్రుపాలెం: ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. ఈక్రమాన అందే ఫిర్యాదులు, వినతులను గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ఎర్రుపాలెం తహసీల్దార్‌ కార్యాలయానికి అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన వచ్చారు. ఇటీవల మండలంలోని మొలుగుమాడులో పైలట్‌ ప్రాజెక్టుగా భూముల రీసర్వే పూర్తికాగా, డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఐదు గ్రామాల్లో చేపట్టిన సర్వే వివరాల నమోదు నేపథ్యాన సర్వే ఉద్దేశం, తద్వారా జరిగే లాభాలపై రైతుల అవగాహన కల్పించాలని సూచించారు. ఆతర్వాత ‘ఎస్‌ఐఆర్‌’ పురోగతిపై ఆరా తీసిన కలెక్టర్‌ హియరింగ్‌కు హాజరైన ఓటర్ల నుంచి పత్రాలు సేకరించి అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని తెలిపారు. ఇక కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేయొద్దని కలెక్టర్‌ సూచించారు. ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సునీత ఎలిజబెత్‌, డిప్యూటీ తహసీల్దార్‌ జ్యోతి, ఆర్‌ఐ శిరీష, సర్వేయర్‌ రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

సమస్య

పరిష్కారానికి కృషి

మధిర: మధిర మండలం దెందుకూరు గ్రామంలో రైల్వే మూడో లైన్‌ నిర్మాణం కారణంగా రైతులు పొలాలకు వెళ్లేందుకు సమస్య ఎదురైనట్లు ఫిర్యాదు అందింది. దీంతో శనివారం కలెక్టర్‌ రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే లైన్‌ మ్యాప్‌ను పరిశీలించి సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రాళ్లబండి రాంబాబు, గ్రామస్తులు కోట వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement