రఘునాథపాలెం/కామేపల్లి: సంప్రదాయ పంటల స్థానంలో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే దీర్ఘకాలం ఆదాయం లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. రఘునాథపాలెం మండలం లచ్చిరాంతండాలో 45 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్‌లో ఆయన మొక్క నాటి మాట్లాడారు. కోతులు, ప్రకృతి వైపరీత్యాల బెడద లేకపోగా సుమారు 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుందని తెలిపారు. అనంతరం కామేపల్లి మండలం ముచ్చర్లలో నర్సరీ చట్టంపై ఏర్పాటుచేసిన సదస్సులో మధుసూదన్ మాట్లాడారు. నర్సరీలు నిర్వహించే వారు లైసెన్సు తీసుకోవడమే కాక ఇతర నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలు పాటించకున్నా, నకిలీ విత్తనాలతో నారు పోసినా రూ.50 వేల జరిమానా విధించడమే కాక ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముందని చెప్పారు. ఈకార్యక్రమాల్లో డివిజన్ల ఉద్యాన శాఖాధికారులు నగేష్, డాక్టర్ ఆకుల వేణు, ఏఓ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారి సత్యేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ న్యాయవాద
పట్టభద్రులకు ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా ఎస్సీ న్యాయవాద పట్టభద్రులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మందినే ఎంపిక చేసేవారని, ప్రస్తుతం అర్హులంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా.. దశల వారీగా ఎంపిక ఉంటుందని వెల్ల డించారు. అంతేకాక గతంలో నెలకు రూ.వేయి చొప్పున 36 నెలల పాటు ఉపకార వేతనం చెల్లించగా, దాన్ని రూ.3 వేలకు, పుస్తకాలు, స్టేషనరీ కోసం ఇచ్చే నగదును రూ.50 వేలకు పెంచినట్లు తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ న్యాయవాద పట్టభద్రులు ఈ–పాస్ వెబ్‌సైట్ ద్వారా ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని, ఆ పథ్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
కొనసాగుతున్న
మహా కుంభాభిషేకం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభా భిషేకం స్వర్ణోత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా యాగశాలలో అర్చకులు, వేద పండితులు చతుర్వేద పారాయ ణం, నవగ్రహా హోమం, గణపతి పూజ చేశారు. అనంతరం అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు అష్టోత్తర కలశ పూజ నిర్వహించగా, భక్తులు కలశాలతో అభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాలిక విద్యను
ప్రోత్సహించాలి
ఏన్కూరు: బాలికలను చిన్నచూపు చూడకుండా చదువుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర విద్యాశాఖ సోషల్ ఆడిటర్ చైతన్యకుమార్ సూచించారు. ఏన్కూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది, తరగతి గదులు, తాగునీరు, తదితర వసతులపై ఆరా తీశాక నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయుడు లక్ష్మాతో చర్చించారు. అనంతరం చైతన్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆగస్టు వరకు తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ భూక్యా లచ్చిరాం ప్రసాద్, ఉపాధ్యాయులు చంద్రిక, నిర్మల, చైతన్య, సత్యావతి, లత, నాగమణి, సదాకోన్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


