ఆయిల్‌పామ్ తోటల సాగులో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,448 మంది రైతులు 2,94,015 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తుండగా.. అందులో 47 శాతం మేర 1,35,569 ఎకరాలు ఇక్కడే ఉండడం విశేషం. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఉమ్మడి జిల్లా దన్నుగా నిలుస్తోంది. ఇక్కడి భూములు, వనరులు అనుకూలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రెండు జిల్లాల్లో కొత్తగా 14,500 ఎకరాల చొప్పున సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం


