● యాప్ ద్వారా పారదర్శకంగా సరఫరా ● గోదాంలు, విక్రయ కేంద్రాల తనిఖీలో కలెక్టర్ దివాకర
చింతకాని: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా యూరియా అందుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ వెల్లడించారు. జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నందున రైతులకు ఆందోళన అవసరం లేదని తెలిపారు. మండలంలోని నాగులవంచ పీఏసీఎస్‌లో ఎరువుల గోదాం, విక్రయ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గోదాంలు, విక్రయ కేంద్రాల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 18,832.34 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోగా పాత నిల్వలు కలిపి 24,93.70 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నా రు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6,071.13 మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా సరఫరా చేసేలా యాప్ ఉపయోగపడుతోందని చెప్పారు. కాగా, యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడడంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యవసాయ, సహకార శాఖల అధికారులు ధనసరి పుల్లయ్య, గంగాధర్, తహసీల్దార్ బాబ్జీప్రసాద్, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, సొసైటీ సీఈఓ శ్రీని వాసరావు, చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు
ఖమ్మంమయూరిసెంటర్: సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణంతో పాటు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దివాకర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ట్రెయినీ కలెక్టర్ పారస్‌కుమార్‌తో కలిసి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్‌సీఓతో ఆయ న సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో తాగునీరు, విద్యు త్, టాయిలెట్, డార్మెటరీ, ఫర్నిచర్, వంట శాల, డైనింగ్ హాల్, భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయించాలని చెప్పారు. వసతి గృహాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి లోపాలు ఎదురైతే నివేదిక ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రతీ ప్రభుత్వ విద్యాసంస్థకు జీరో విద్యుత్ బిల్లు వచ్చేలా విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా పర్యవేక్షించాలని, ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా బీసీ, సాంఘిక సంక్షేమ అధి కారి జి.జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధి కారి ముజాహిద్, విద్యుత్‌శాఖ ఏఓ కె.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


