గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాల ఆవిష్కరణ

Jul 1 2026 12:22 AM | Updated on Jul 1 2026 12:22 AM

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ వంగూరు మోహన్‌రావు మంగళవారం ఆవిష్కరించారు. సర్కిల్‌ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ మాట్లాడుతూ.. జాతిపిత, రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఉద్యోగి పనిచేయా లని సూచించారు. కార్యక్రమంలో ఇంజనీర్లు బాబూరావు, నాగేశ్వరరావు, భద్రుపవార్‌, రాములు, రామారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రమేశ్‌కుమార్‌, ఖాదర్‌బాబా, సీహెచ్‌ నాగార్జున, కోక్యానాయక్‌, నాగమల్లేశ్వరరా వు, నరేశ్‌, అధికారులు, యూనియన్ల నాయకులు శ్రీధర్‌, తిరుపతి, ఎం.సత్యనారాయణ రెడ్డి, శేషగిరిరావు, శ్రీనివాసరావు, ప్రసాద్‌, విక్రమ్‌, మూర్తి, కృపాకర్‌, కిరణ్‌ చక్రవర్తి, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సన్మానం

ఖమ్మంక్రైం: పోలీస్‌ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన అధికారులను సీపీ సునీల్‌దత్‌ మంగళవారం సన్మానించారు. ఖమ్మంలోని సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రంమలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పలు విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులు పోలీస్‌ శాఖ కు ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఎస్‌ఐలు సుబ్బారావు, లక్ష్మణ్‌రావు, సుబ్బారావు, కృష్ణ య్య, కృష్ణారావు, రాంప్రకాష్‌రావు, ఏఎస్‌ఐలు శ్రీనివాసాచారి, సీహెచ్‌.వెంకటేశ్వరరావు, అబ్దుహమీద్‌, హెడ్‌కానిస్టేబుళ్లు ఎం.వీ.సత్యనారయణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, లాల్‌సాహెబ్‌, బుల్లయ్య ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ రామానుజం, ఏసీపీలు సాంబరాజు, నర్సయ్య, సీఐలు సర్వయ్య, కామరాజు, నాగుల్‌మీరా, పోలీస్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

10 నుంచి మూడు రోజులు ‘టీఆర్‌ఎస్‌’ బాయిబాట

రుద్రంపూర్‌: తెలంగాణ రక్షణ సమితి (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యా న ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో బాయిబాట నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మ ద్‌ తెలిపారు. ఈ మేరకు 10వ తేదీన కొత్తగూ డెం ఏరియాలోనీ పీవీకే–5 ఇంక్‌లైన్‌ గని, 11న సత్తుపల్లిలో, 12న మణుగురులో గేట్‌ మీటింగ్‌లకు కవిత హాజరవుతారని పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ నిర్వహణ, కొత్త బ్లాక్‌ల ఏర్పాటులో జాప్యం, భూ నిర్వాసితులను పర్మనెంట్‌ ఉద్యోగులుగా నియమించడంపై కార్మికులతో చర్చించడమే కాక ఇతర సమస్యలు పరిశీలిస్తారని రియాజ్‌ ఒక ప్రకటనలో వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement