ఇన్‌చార్జ్‌ డీఎస్‌ఓగా వెంకటేశ్వర్లు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌ డీఎస్‌ఓగా వెంకటేశ్వర్లు

Jul 1 2026 12:22 AM | Updated on Jul 1 2026 12:22 AM

ఖమ్మంసహకారనగర్‌: జిల్లా సైన్స్‌ అధికారి (డీఎస్‌ఓ)గా ఇనుముల వెంకటేశ్వర్లుకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ డీఈఓ సదానందం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సైన్స్‌ అధి కారి ఆర్‌.శ్రీనివాసరావు వ్యక్తిగత సెలవుపై అమెరికా వెళ్లారు. దీంతో నేలకొండపల్లి మండలం ఆరెగూడెం పాఠశాల బయోలాజికల్‌ సైన్స్‌ టీచర్‌ వెంకటేశ్వర్లును ఆ స్థానంలో ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన ఇన్‌చార్జ్‌ సైన్స్‌ అధికారిగా మ్యూ జియం బాధ్యతలు, ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫేర్‌ తదితర అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాగా, వెంకటేశ్వర్లు జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు 2017 నుంచి జిల్లా సమన్వయకర్తగా, 2022 నుంచి నేషనల్‌ గ్రీన్‌ కాప్స్‌ జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆరెగూడెం హెచ్‌ఎం చలపతిరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

వడ్డీ పేరుతో రూ.1.50 కోట్ల అప్పు, ఆపై మాయం

ఖమ్మంరూరల్‌: పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించిన ఓ వ్యాపారి పరారైన ఘటన ఖమ్మంరూరల్‌ మండలంలోని గోళ్లపాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆర్‌.దేవేందర్‌ స్థానికంగా మామిడి తోటలను కొనుగోలు చేసి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అందరితో నమ్మకంతో వ్యవహరించిన ఆయన పెద్ద మొత్తంలో వడ్డీ ఇస్తానంటూ రూ.1.50 కోట్ల మేర అప్పు తీసుకున్నాడు. అనంతరం ఈ నెల 19న భార్యాపిల్లలతో కలిసి సామగ్రి సర్దుకుని ఎవరికీ చెప్పకుండా గ్రామం నుంచి వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆయన సెల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వస్తోంది. ఈ మేరకు మంగళవారం బాధితులు ఖమ్మంరూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement