విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన

Jul 1 2026 12:22 AM | Updated on Jul 1 2026 12:22 AM

చర్ల: గిరిజన సంక్షేమ పరిధిలోని పాఠశాలల్లో బాలబాలికల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దీపకం వర్క్‌ బుక్‌లోని అంశాలు అర్థమయ్యేలా బోధించాలని భ ద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్‌ సూ చించారు. చర్ల మండలం చెన్నాపురం, ఉయ్యాలమడుగు గ్రామాల్లోని గిరిజన ప్రాథమిక పాఠశాలలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పాఠం బోధించడమే కాక ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు. ఉద్దీపకం వర్క్‌బుక్‌ ద్వారా బోధనా తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన క ల్పించాలని సూచించారు. చెన్నాపురం పాఠశాలలో 55 మంది పిల్లలు ఉన్నందున మరో ఉపాధ్యాయుడిని కేటాయిస్తామన్నారు. అనంతరం ట్రైబల్‌ డీడీ చందన తిమ్మిరిగూడెం జీపీఎస్‌లో తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు రమేశ్‌, శ్రీనివాస్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.

భద్రాచలంటౌన్‌: ఐటీడీఏ పరిధి పట్టు పరిశ్రమ శాఖ అటెండర్‌ లక్ష్మి ఉద్యోగ విరమణ చేయగా, ఐటీడీఏ కార్యాలయంలో పీఓ రాహుల్‌ సన్మానించారు. విధినిర్వహణలో చూపిన చొరవ ఎన్నటికీ గుర్తుంటుందని తెలిపారు. ఏపీఓ డేవిడ్‌ రాజ్‌, అధికారులు ఉదయ్‌కుమార్‌, గన్యా, సంతోష్‌, ఆదినారాయణ పాల్గొన్నారు.

భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement