ఖమ్మంసహకారనగర్: సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ తర్వాత ఈహెచ్‌ఎస్ వర్తించేలా కృషి చేస్తామని ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఈహెచ్‌సీటీ కమిటీ సభ్యుడు దేవరకొండ సైదులు తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌టీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత పడుతున్న ఇబ్బందులును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అలాగే, ఇప్పటికే ఉద్యోగ విరమణ చేసిన వారికి హెల్త్‌కార్డుల జారీకి ప్రయత్నిస్తామని తెలిపారు. సమావేశంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శశిధర్ తదితరులు పాల్గొన్నారు.


