మహా కుంభాభిషేకానికి అంకుర్పారణ | - | Sakshi
Sakshi News home page

మహా కుంభాభిషేకానికి అంకుర్పారణ

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీవారి మహా కుంభాభిషేక స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు జీర్ణోద్ధరణ, ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేకం సందర్భంగా అర్చకులు వేదమంత్రోచ్ఛరణ నడుమ స్వామి వారు, అమ్మవార్లను యాగశాల ప్రవేశం చేయించారు. అక్కడ గణపతి పూజను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క – నందిని దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు భట్టి దంపతులకు స్వాగతం పలికి కుంభాభిషేకం ప్రాధాన్యతను వివరించారు. ఆతర్వాత డిప్యూటీ సీఎం దంపతులు స్వామి, అమ్మవార్లకు పూజలు చేయగా అర్చకులు ఆశీర్వచనం, శేషవస్త్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి, గిడ్డంగుల సంస్థలు, సుడా చైర్మన్లు సుంకేట అన్వేష్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, సర్పంచ్‌ తుళ్లూరు నిర్మల, మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావు, వకుళామాత స్టేడియం నిర్మాణదాత కోటేశ్వరరావుతో పాటు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, జిల్లా, మండల నాయకులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వి.సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జమలాపురంలో ప్రారంభించిన

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement