సబ్‌స్టేషన్‌ను చార్జి చేసిన సీఎండీ | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌ను చార్జి చేసిన సీఎండీ

Jun 30 2026 12:54 AM | Updated on Jun 30 2026 12:54 AM

పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభానికి

అడుగులు

కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్మిస్తున్న గోద్రెజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీని జూలై నాటికి సిద్ధం చేయాలన్న ఉన్నతాధికారుల సూచనలతో పనుల్లో వేగం పెంచారు. ఈమేరకు ఫ్యాక్టరీ కోసం ఏర్పాటుచేసిన సబ్‌ స్టేషన్‌ను సోమవారం ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి సాంకేతికంగా చార్జ్‌ చేశారు. ఆపై ఫ్యాక్టరీలో విద్యుత్‌ సరఫరా తీరును పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. వర్షాకాలం గాలిదుమారాలకు అవకాశం ఉన్నందున ఉద్యోగులు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, గ్రామాల్లో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వైరా డీఈ వై రమేష్‌కుమార్‌, ఉద్యోగులు కిరణ్‌చక్రవర్తి, కిరణ్‌కుమార్‌, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో పరిశీలన

ఖమ్మంవ్యవసాయం: సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని ఫుడ్‌పార్క్‌లో సీఎండీ వరుణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు కావాల్సిన విద్యుత్‌ సరఫరా, లోడ్‌, భవిష్యత్‌ విస్తరణ అవకాశాలపై అధికారులతో సమీక్షించారు. అలాగే, యూనిట్లకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫుడ్‌పార్క్‌లో కొన్నాళ్లు పరిశ్రమ నిర్వహించి మూసేసిన కంపెనీ నుంచి రావాల్సిన బకాయిలపైసీఎండీ ఆరా తీసినట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement